స్వీయ నియంత్రణ పాటించి..కరోనాను అరికడదామని తెలంగాణ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం లాక్‌డౌన్ పొడిగించారని తెలిపారు. నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదని సీఎం కేసీఆర్ తగు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలతో దేశంలో ఏ రాష్ట్రం అరికట్టలేని విధంగా కరోనా వ్యాప్తిని మనం అడ్డుకోగలుగుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.