మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈరోజు రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన తన తొలి సంతకాన్ని ఒక చెక్కుపై చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన ఆ చెక్కును ఓ మహిళకు ఆయన అందజేశారు. సెక్రటేరియట్ కు వచ్చిన ముఖ్యమంత్రి చెక్కుపై తొలి సంతకం చేసి కుసుమ్ వెంగర్లేకర్ అనే మహిళకు అందించారని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ ఉదయం దాదాపు 80 నిమిషాల పాటు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత రేపు తీర్పును వెలువరిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడిన వెంటనే ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు.