telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరావు బదిలీ

Intaligence Venkateshwar Rao Transfer
హైకోర్టు ఆదేశాలతో ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించిన నేపథ్యంలో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 26వ తేదీన  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
సీఈసీ  ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై తాము జోక్యం చేసుకోబోమని ఏపీ సర్కార్ పిటిషన్‌నుహైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సీఈసీ పరిధి నుండి తప్పిస్తూ ఏపీ సర్కార్ గురువారం జీవోను జారీ చేసింది. శుక్రవారం  హైకోర్టు  తీర్పు నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావును పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.

Related posts