telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

బిజెపిలో చేరిన .. వరదాపురం సూర్యనారాయణ …

anantapuram tdp leader into bjp

బిజెపి అధిష్టానం నుండి ఫోన్ రావటంతో ఢిల్లీ వెళ్ళిన అనంతపురం టీడీపీ నేత సూరి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. నిజానికి సూరి చేరాల్సింది జూలై 5వ తేదీన. కానీ వివిధ కారణాల వల్ల బిజెపి నాయకత్వం అర్జంటుగా రావాలని కోరటంతో ఢిల్లీ వెళ్ళి పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ధర్మవరం నుండి గెలిచిన సూరి ఐదేళ్ళల్లో బలమైన నేతగా ఎదిగారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డమైన సంపాదనతో అంగ, ఆర్ధిక బలాల్లో బాగా పటిష్టమైపోయారు.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోగానే సూరి ప్లేటు ఫిరాయించారు. పార్టీ మారద్దని చంద్రబాబునాయుడు కోరినా వినకుండా బిజెపిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తర్వాత ఐదేళ్ళ తన అరాచక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడుతుందో అన్న భయంతోనే సూరి పార్టీ మారినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఐదేళ్ళల్లో సూరి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని వైసిపి నేతలు ఎప్పటి నుండో మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే కేవలం కేసుల నుండి రక్షణ కోసమే సూరి పార్టీ మారినట్లు అర్ధమవుతోంది. సూరి బాటలోనే మరికొందరు నేతలు కూడా బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది!!

Related posts