telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఇక డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడితే పదేళ్ల జైలు…

cp sajjanar on disa accused encounter

మాదాపూర్, గచ్చిబౌలి లలో జరిగిన డ్రంకెన్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాల మీద సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. రెండు ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం వల్లే జరిగాయని సజ్జనార్ పేర్కొన్నారు. ఈరోజు ప్రమాదం గురించి. ఎన్టీవీ ఆయన వివరణ కోరగాక ఇకపైరింత కఠినంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని అన్నారు. డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో డ్రంకెన్ డ్రైవింగ్ కి  ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక మీదట డ్రంకెన్ డ్రైవింగ్ లో దొరికితే..పదేళ్లు జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎక్కడో మద్యం తాగి సైబరాబాద్ లోని రోడ్లపైకి లాంగ్ డ్రైవ్ అంటూ వస్తున్నారని అన్నారు. అంతే కాక డ్రంకెన్ డ్రైవ్ లో పిల్లలు పట్టుబడగానే…మా వాడు ఇలా ఎప్పుడు చేయడు అంటూ చెప్పే పేరెంట్స్ ఎక్కువయ్యారని అన్నారు. ఇక పై పేరెంట్స్ నూ వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా పబ్బులలో మద్యం తాగి సైబరాబాద్ లో డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుబడితే…ఆ కేసులో పబ్బు నిర్వాహకులను చేరుస్తామని అన్నారు. మద్యం తాగి పబ్బులోంచి బైటకు వచ్చే వారిని ఇంటికి చేర్చే బాధ్యత పబ్బు నిర్వాహకులదేనని, లేదా వారి సొంత వాహనాలకు పబ్బులే ప్రత్యామ్నాయ డ్రైవర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. 

Related posts