telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ లో కొత్త జట్ల పై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు…

ganguly and dravid meet on acadamy

ఐపీఎల్‌ 2020 ముగిసింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ టైటిల్‌ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నుండి ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని ప్రచారం జోరుగా సాగుతుంది. 9వ జట్టుగా గుజరాత్ ఆడనుందని, అహ్మదాబాద్‌ బేస్డ్‌ గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలుచేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా కూడా ఉందని సమాచారం. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈ వార్తలు నిజం అనే అనిపిస్తుంది. తాజాగా ద్రావిడ్ మాట్లాడుతూ… ఐపీఎల్ 2020 లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. తమ జట్లలోని సీనియర్ ఆటగాళ్ల నుండి నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. కానీ యువ ఆటగాళ్లకు అందరికి ఆడేందుకు ఆవకాశం రాలేదు. ”కానీ ఇప్పుడు కొత్త జట్ల రాకతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు లాభం చేకూరుతుంది” అని  ద్రావిడ్ అన్నాడు. అంటే ఐపీఎల్ 2021 లో కొత్త జట్లు రావడం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ విషయం పై బీసీసీఐ ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తుంది అనేది.

Related posts