telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ కు అన్నగా మంచు విష్ణు…!

Mosagallu

మంచు విష్ణు హీరోగా వస్తోన్న సినిమా ‘మోసగాళ్లు’. అయితే ఈ చిత్రంలో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి విష్ణు ఇటివలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో రాబోతుందని.. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశామని, ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తుందని విష్ణు నమ్మకంగా చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Related posts