telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఐకాన్” కోసం వేరే హీరోలు ?

Icon

అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్‌- కనబడుటలేదు’ అనే సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించేశారు. ‘ఓ మైండ్‌ ఫ్రెండ్‌’, ‘ఎమ్‌సీఏ’ సినిమాలతో ఆకట్టుకున్న వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్‌ ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం నుండి ఎటువంటి అప్‌డేట్‌ లేదు. నిజానికి `అల వైకుంఠపురములో..` సినిమా కంటే ముందే ఇది పట్టాలెక్కాల్సింది. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా `ఐకాన్` గురించి దిల్ రాజ్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రకటించింది. అయితే అల్లు అర్జున్ మాత్రం అగ్ర దర్శకులతోనే పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను లైన్లో పెట్టాడు. దీంతో బన్నీ ఇక `ఐకాన్` చేయడని తేలిపోయింది. దీంతో మరో హీరో వైపు దిల్ రాజు దృష్టి సారిస్తున్నారట. ఈ కథపై దిల్ రాజు పూర్తి నమ్మకంతో ఉన్నారట. ప్రస్తుతం `వకీల్ సాబ్` సినిమాతో బిజీగా ఉన్న వేణు శ్రీరామ్.. త్వరలో `ఐకాన్` కథను రామ్‌చరణ్ లేదా నానికి చెప్పాలని అనుకుంటున్నారట.

Related posts