సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు సమీపంలోని ముత్తంగి మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేపింది. బాలికలకోసం నిర్వహిస్తు్న్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 520 మంది చదువుకుంటున్నారు.
వీరిలో 43 మంది విద్యార్థులు, ఒక లెక్చరర్ కు కరోనా పాజిటివ్ నిర్థారణైంది. కరోనా సోకిన వారినందరినీ.. కళాశాలలోని ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉంచారు. విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను అభ్యర్థించారు. కరోనా నియంత్రించేందుకు గురుకుల విద్యాలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్