telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆ డాలర్ ను నన్నే తీసుకోమన్నారు..

తిరుమల దేవస్థానంలో చిరుద్యోగిగా చేరిన శేషాద్రి పూజాకైంకర్యాల నిర్వహణలోనూ పట్టుసాధించారు. అర్చకుడు కాదు… సుప్రభాత సేవనుంచి … స్వామివారి పవళింపుసేవదాకా జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న శేషాద్రి, ఆలయ ప్రధాన అర్చకులతోనూ, ఆలయ కార్యనిర్వహణాధికారులతోనూ మంచిగా మెలిగేవారు. కార్తీక దీపోత్సవ సందర్భంగా విశాఖ పట్నం వెళ్లిన శేషాద్రి గుండెపోటుతో తనువు చాలించారు.

శేషాద్రి… ఆలయాధికారులతోనే కాదు.. దర్శనానికొచ్చే ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సత్సంబంధాలున్నాయి. 2004లో ఆకేపాటి వెంకట ధర్మారెడ్డి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శేషాద్రి పరిచయమయ్యారు. ధర్మారెడ్డి రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకున్న శేషాద్రి అంత్యంత సన్నిహితంగా మెలిగారు. ధర్మారెడ్డి కొన్నాళ్ల తర్వాత తిరుమలనుంచి బదిలీ అయ్యారు. రాజకీయపలుకుబడిని ఉపయోగించుకుని.. మళ్లీ ధర్మారెడ్డి అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా బాధ్యతలు చేపట్టారు.

విశాఖపట్నంలో తనువుచాలించిన శేషాద్రిని తలచుకుని… టీటీడీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రత్యేకంగా మీడియా సమావేశంపెట్టి తన మనోభావాన్ని వ్యక్తంచేశారు. డాలర్ శేషాద్రి… విశాఖ వెళ్లొద్దని చెప్పినా… వినకుండా వెళ్లారనీ, దేవుడి సేవలోనే తరిస్తామని వెళ్లిన శేషాద్రి తిరిగిరాని లోకాలకు వెళ్లారని భాష్పాంజలి ఘటించారు.

శేషాద్రి కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలను మీడియాతో పంచుకున్నారు. శేషాద్రి ధరించిన బంగారు గొలుసు, వెంకటేశ్వరస్వామి కాసునుతననే తీసుకోమన్నారని గుర్తుచేశారు. చైను, డాలర్ బరువు కనీసం పావుకిలోమేర ఉంటొందని సమాచారం. ఇంతకీ శేషాద్రి కుటుంబీకులు బంగారు గొలుసు, వెంకటేశ్వరస్వామి కాసును ధర్మారెడ్డికి ఇస్తారో లేదో తెలియదుగానీ, ధర్మారెడ్డి మాత్రం ఆ విషయాన్ని గుర్తుచేశారు.

Related posts