telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ పై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు…

Errabelli Trs

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… 21న ఉదయం 10:30కు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం భూమి పూజ చేస్తారు. కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం అనంతరం యాదాద్రికి బయలుదేరుతారు. సెంట్రల్ జైల్ స్థలంలో 30 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ప్రస్తుతం కెనడాలో మాత్రమే 24అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులో ఉంది. వరంగల్ లో నిర్మించే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్దది. ఆస్పత్రులు వస్తే బీజేపీ నేతలను నష్టం ఏంటి అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కోర్టుకు పోయి ఆస్పత్రి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. మీ పార్టీలో చేరిన వారంతా భూములు ఆక్రమించుకున్న వారే. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడం వెనుక  ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉంది. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి మెరుగైన వైద్యం అందించాం అన్నారు. వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రప్రభుత్వం విఫలమైంది అని పేర్కొన్నారు.

Related posts