హాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు టామ్ క్రూజ్ అదిరిపోయే సాహసం చేశాడు. ఏకంగా రెండు వేల అడుగుల ఎత్తులో విమానంపై సాహసం చేశాడు. అందరు హీరోలు నేలపై స్టంట్స్ చేస్తే, ఈయన మాత్రం అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫాపైనా సాహసాలు చేశారు. అంతరిక్షంలోనూ ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లి వచ్చారు.
‘మిషన్ ఇంపాజిబుల్’ సీక్వెన్స్‌లో వస్తున్న ఎనిమిదో సినిమా కోసం టామ్ అసాధ్యమైన ఫీట్ చేశాడు..ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ సీక్వెల్స్ అన్ని భారీ విజయాన్ని కూడా సాధిస్తున్నాయి. మాములుగా చాలా సినిమాలో రిస్కీ షాట్లు డూపులే చేస్తారు. కానీ టామ్ క్రూయిజ్ సొంతంగా తానే చేస్తాడు.
ఈ సీక్వెల్ లో వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ సినిమా షూటింగ్ భాగంగా.. రెండువేల అడుగుల ఎత్తులో ప్రైవేట్ విమానం ఎగురుతుండగా, దాని కాక్‌పిట్‌లో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై కూర్చున్నారు. ఆ తర్వాత విమానం రెక్క పట్టుకుని తలకిందులుగానూ వేలాడాడు. ఆ సమయంలో పైలట్ ఆ విమానాన్ని పల్టీ కొట్టించాడు. ఆ పక్కన మరో విమానంలో నుంచి ఇదంతా షూట్ చేస్తున్నారు.
ఇలా డూప్ లేకుండా ఇంత రిస్కీ షాట్లు తీయడం టామ్ కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి రిస్కులు ఎన్నో చేశాడు .ప్రస్తుతం ఈ స్టంట్స్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.