telugu navyamedia
సినిమా వార్తలు

“కూలీ నెం.1” సెట్లో భారీ అగ్నిప్రమాదం… ఆగిపోయిన షూటింగ్

Coolie

వ‌రుణ్ ధావ‌న్, సారా అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న “కూలీ నెం.1” చిత్రం ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిందట‌. మంటలలో సెట్లను పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా షూటింగ్ నిలిచిపోయింది. రీమేక్ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో జ‌రుపుకోగా, ప్ర‌స్తుతం ముంబైలో చిత్ర షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజా స‌మాచారం ప్రకారం ఈ సెట్ పునర్నిర్మించటానికి కనీసం పక్షం రోజులు పడుతుంది . దీంతో చిత్ర‌ ప్రధాన నటులకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు తమ త‌మ‌ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. “కూలీ నెంబర్ 1” చిత్రం 1995 లో ఇదే పేరుతో విడ‌ద‌లైన చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. గోవింద మరియు కరిష్మా కపూర్ నటించిన రీమేక్ చిత్రాన్ని వ‌రుణ్ ధావ‌న్ తండ్రి డేవిడ్ ధావ‌న్ రూపొందించారు. రీమేక్ కూడా ఆయ‌న సార‌థ్యంలోనే రూపొందుతుంది.

Related posts