తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(ఫెఫ్సీ)కి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. మరో తమిళ నటి ఐశ్వర్య రాజేష్ లక్ష రూపాయలను విరాళంగా అందించారు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కరోనా క్రైసిస్ ఛారిటీ కి రూ. లక్షను విరాళంగా ప్రకటించారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు హీరోలు,హీరోయిన్లు ముందుకు వచ్చారు. కంగనా రనౌత్ పీఎం కేర్స్ నిధికి 25 లక్షలు ప్రకటించారు. దీపికా పదుకోనే కూడా తన వంతుగా సాయం చేస్తామని చెప్పారు. తెలుగులో చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. తమిళనాడులో కూడా పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు.
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్