నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం నవీనచిత్ర వారి “సవతి కొడుకు” చిత్రం 22-02-1963 విడుదలయ్యింది.
నిర్మాత వై.రంగారావు గారు స్వీయ దర్శకత్వంలో నవీనచిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని కి మాటలు, పాటలు: బైరాగి, కధ, స్క్రీన్ ప్లే: వై.రంగారావు, సంగీతం: సి.హెచ్. సత్యం, ఫోటోగ్రఫీ: కె. జానకిరామ్, నృత్యం: వి.జె.శర్మ, కళ: ఆర్.జయరామరెడ్డి, ఎడిటింగ్: కె. సత్యనారాయణ, అందించారు.
ఈచిత్రంలోఎన్.టి.రామారావు, షావుకారు జానకి, గుమ్మడి, రేలంగి, గిరిజ, వాసంతి, హేమలత, చదలవాడ, సి.ఎస్.ఆర్., వంగర, లక్ష్మీ కాంతమ్మ, తదితరులు నటించారు. సంగీత దర్శకులు సి.హెచ్.సత్యం కు ఇది మొదటి సినిమా కావటంతో సంగీత దర్శకులు టి.వి.రాజు గారు సంగీత పర్యవేక్షణ జరిపారు.
వీరి సంగీత సారధ్యంలో..
“నయనాల నీలాలలో నీవేకదా జాబిలి”
“ఈ దేశం ఆంధ్రుల దేశం రా”
“అమ్మా,అమ్మా నీ ప్రాణమే పోసినావే”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆ ఏడాది 1963 ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ గారు నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి.
06-02-1963 న పెంపుడు కూతురు,
09-02-1963 న వాల్మీకి,
22-02-1963 న సవతి కొడుకు సినిమాలు విడుదల కావటం జరిగింది. ఈ విధంగా ఏ హీరో కు కూడా ఒకే నెలలో మూడు సినిమాలు విడుదల కావటం జరగలేదు. దీనీతో ఎన్టీఆర్ గారి చిత్రాలే ఆయనకు పోటీ కావటం
తో ఆ సినిమాలు రన్నింగ్ దెబ్బతిన్నాయి. ఈ చిత్రం యావరేజ్ గా నడిచి పలు కేంద్రాలలో అర్థశతదినోత్సవాలు జరుపుకున్నది.
విజయవాడ జైహింద్ టాకీస్ లో – 56 రోజులు ప్రదర్శింపబడింది.