telugu navyamedia
సినిమా వార్తలు

60 సంవత్సరాల “మర్మయోగి”

నందమూరి తారకరామారావు గారు నటించిన జానపద చిత్రం జూపిటర్ పిక్చర్స్ వారి “మర్మయోగి” సినిమా 22-02 1964 విడుదలయ్యింది.

నిర్మాత యస్.కె.హబీబుల్లా జూపిటర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు బి.ఏ. సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్నికి మాటలు: ముద్దు కృష్ణ, పాటలు: ఆరుద్ర, కోసరాజు, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: పి.దత్తు, నృత్యం: వి.జె.శర్మ, కళ: ఎస్.వాలి, ఎడిటింగ్: కె.ఏ.మార్తాండ్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, కాంతారావు, గుమ్మడి, లీలావతి, బాలకృష్ణ(అంజి), చదలవాడ, లంక సత్యం, మీనాకుమారి తదితరులు నటించారు.

ప్రముఖ నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో జాలువారిన పాటలు
“రావాలి రావాలి రమ్మంటే రావాలి”
“నవ్వుల నదిలో పువ్వుల పడవా”
వంటి పాటలు ప్రేక్షకులకు హత్తుకు పోయాయి.

ప్రేక్షకులను ఆహ్లాద పరచేవిధంగా కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు, గొలుసు దివిటీ పోరాటాలతో చిత్రీకరింపబడిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మాయలు మంత్రాలు లేకుండా కేవలం కధాబలంతో నడిచిన ఈ జానపద తెలుగు చిత్రం కు మాతృక తమిళ హీరో ఎం.జి. రామచంద్రన్ గారి తో నిర్మించిన తమిళ చిత్రం “మర్మయోగి” (1951).

ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఎక్కువభాగం ఛత్రపతి శివాజీ గెటప్ తో మారువేషంలో కనిపించటం విశేషం. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన నటి కన్నడ యాక్టర్ లీలావతి. ఈ చిత్రం యావరేజ్ గా నడిచి కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది.

ఈ సినిమా విజయవాడ — జైహింద్ టాకీస్ లో 55 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts