telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారు: రేవంత్

Revanth-Reddy mp

తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో జన్ వాడ వద్ద కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, చట్టాలను అతిక్రమిస్తూ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ దర్జాగా గడుపుతున్నారని, నిబంధనలకు నీళ్లొదిలి పాతిక ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు.

Related posts