వ్యక్తిగత స్పర్థలను దూరంచేసుకుని పార్టీని బలోపేతంచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త నాదెండ్ల మనోహర్ సూచించారు. తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలో నిర్వహించిన జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఎదుట పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు వ్యవహారంపై కొంతమంది జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో అమలాపురం జనసేన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అమలాపురం ఇంచార్జి కలుపుకుని వెళ్లకుండా వర్గాలుగా విభజించి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరని కొందరు నాయకులుఅసహనం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అందరని కలుపుని పార్టీని బలోపేతం చేయాలని సభాముఖంగా నాయకవర్గాన్ని, కార్యకర్తలను వేడుకున్నా ఫలితంలేకుండా పోయింది.
ఈ సమావేశంలో వేదికపై కట్టిన ఫ్లెక్సీలో అమలాపురం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.యం.ఆర్ శేఖర్ ఫోటో కూడా వెయ్యకుండా రెండు వర్గాలు విభజించే విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారని జనసైనికులు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశ ప్రాగణంలోనే ఇరువర్గాలు వాదోపవాదాలకు దిగాయి. దీంతో కొద్ధిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
నాదెండ్ల మనోహర్ ఎదుటే మనోభావాలను వ్యక్తంచేస్తూ రచ్చచేశారు. జిల్లా నాయకులు సర్ది చెప్పడం తో కొంత వరకు సద్ధుమణిగినా…ఈ పంచాయతీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు. జనసేన పార్టీలో వర్గవిభేదాలకు తావులేకుండా… క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలనే అభిప్రాయం నాదెండ్ల వ్యక్తంచేశారు.
వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత