telugu navyamedia
తెలంగాణ వార్తలు

విపక్షాలకు ధాన్యం కొనుగోలుపై మాట్లాడే నైతికత లేదు..

విపక్ష పార్టీలకు ధాన్యం కొనుగోలు విషయంపై మాట్లాడే నైతికత కాంగ్రెస్, బీజేపీలకు లేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ రైతు ప్రయోజనాలను ఆకాంక్షించిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 70 శాతం పంట కొనుగోలు పూర్తి చేశామనీ, ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోళ్లు కేంద్రలు ప్రారంభించామని ప్రస్తావించారు.

వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనన్నారు. పీయూష్ గోయల్‌దో వైఖరి ఒకలా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం ఒక లెటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుతో తడిసిన వడ్లు కొనలేక పోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడనే అభిప్రాయం వ్యక్తంచేశారు. నారాయణఖేడ్‌కు తాగు, సాగు నీటి ఇవ్వాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 70 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ త్రాగునీరు సాగు నీరు అందిచలేదని విమర్శించారు.

రైతు బంధు క్రింద నారాయణఖేడ్ కు 200 కోట్లు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు.సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలపథకంతో సంగారెడ్డి జిల్లా కు నీరు అందిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. 4 వేల నాలుగు వందల కోట్లతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Related posts