telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్

kavitha trs

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలు అయింది. ఆరు టేబుల్ లపై లెక్కింపు చేయనున్న అధికారులు…మొత్తం రెండు రౌండ్ లను ఏర్పాటు చేసారు. మొత్తం 823 ఓట్లు ఉండగా.. మొదటి రౌండ్ లో 600 ఓట్ల లెక్కింపు చేయనున్నారు. రెండో రౌండ్ లో 223 ఓట్ల లెక్కింపు చేయనున్నారు అధికారులు.

పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 413గా ఉంది. మొదటి రౌండ్ లోనే ఫలితం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 10: 30 లోపు విజేతను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోలైన ఓట్లలో ఆరో వంతు అంటే మొత్తం 138 ఓట్లు వస్తేనే డిపాజిట్ దక్కే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ ధీమాగా ఉంది.

Related posts