telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేడే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్…

corona vaccine

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ను ప్రారంభం కాబోతున్నది.  ఈ ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సిన్ డ్రైరన్ ను ప్రారంభించబోతున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు.  3 రకాల ప్రాంతాల్లో డ్రైరన్ ను నిర్వహించనున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్.సి, ప్రైవేట్ ఆసుపత్రిలో డ్రైరన్ ను నిర్వహించనున్నారు.  ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ప్రక్రియ ఉంటుంది.  వ్యాక్సినేషన్ పక్రియను రాష్ట్ర, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పర్యవేక్షిస్తారు.  కోవిన్ సాఫ్ట్ వేర్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికే వ్యాక్సినేషన్ అందించనున్నారు.  టీకా సమయంలో క్షేత్ర స్థాయి సాంకేతిక సమస్యల పరిశీలిస్తారు.  టీకా తీసుకున్నవారు అరగంట సేపు వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రంలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  హైదరాబాద్ నగరంలో మూడు ప్రాంతాల్లో డ్రైరన్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నాంపల్లి ఏరియా ఆసుపత్రి, తిలక్ నగర్ పీహెచ్.సి, ప్రైవేట్ ఆసుపత్రిలో డ్రైరన్ కు ఏర్పాట్లు చేసారు.  ఒక్కో సెంటర్ లో 25 మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. చూడాలి మరి ఇది సఫలం అవుతుందా… లేదా అనేది.

Related posts