telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్..గ్యాంగ్రీన్ వ్యాధి ఎటాక్

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో దేశం అల్లాడుతుంటే.. కొత్తగా బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి దశలో విరుచుకుపడిన కరోనాతో పోల్చితే.. రెండో దశ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న బాధితుల సంఖ్యే కాకుండా.. మరణాలు కూడా పెరగడం కలచివేస్తోంది. ముఖ్యంగా వైరస్ శరవేగంగా ఊపిరితీత్తుల్లోకి చేరుతోంది. దీంతో బాధితులు ఆక్సిజన్ తీసుకోడానికి ఇబ్బందిపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగ‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్ వ్యాధిని గుర్తించమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు మూసుకుపోవడం.. దీంతో ఆ భాగానికి ప్రాణవాయువు, పోషకాల సరఫరా నిలిచిపోవడం ఈ వ్యాధి లక్షణం. గ్యాంగ్రీన్ వ్యాధిని త్వరగా గుర్తించకపోతే.. మరణం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు గుజరాత్ లో బయటపడ్డట్లు తెలుస్తోంది.

Related posts