telugu navyamedia
సినిమా వార్తలు

ఇకపై సినిమాలు చేయను – స్టార్ కమెడియన్

స్టార్ కమెడియన్, యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఇక సినిమాలు చేయ‌నంటూ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు షాక్‌ ఇచ్చారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ‌కృష్ణ‌..’జాతిరత్నాలు’ సినిమాతో మరింత క్రేజ్‌ సంపాదించుకున్నాడు.  

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తూ మంచి ఫాంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదిక‌గా షాకింగ్ పోస్ట్ పెట్టాడు. 2022 నా లాస్ట్ ఇయర్  సినిమాల్లో అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.
దీంతో రాహులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏంది బ్రో అంత మాటా అన్నావ్?’ అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు.

2017లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో స్నేహితుడిగా మెప్పించాడు. ‘గీత గోవిందం’, ‘చిలసౌ’, ‘హుషారు’ తదితర సినిమాల్లో రాహుల్ రామకృష్ణ నవ్వించారు. ‘జాతిరత్నాలు’ సినిమాలో ఆయన చేసిన కామెడీని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ‘భరత్ అనే నేను’, ‘రిపబ్లిక్’ సినిమాల్లో రాహుల్ రామకృష్ణ  కూడా చేశారు.

 

 

Related posts