సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇప్పుడు ఈ సినిమాలోంచి ‘పెన్నీ’ అనే సెకండ్ సింగిల్ సాంగ్ మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం అంతేకాకుండా మహేష్ న్యూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని లెదర్ జాకెట్ – బ్లాక్ ప్యాంట్ లో ఉబర్ కూల్ అండ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు.
ఈ చిత్రంలో మహేశ్‌బాబు.. బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్