telugu navyamedia
సినిమా వార్తలు

నీ భర్తకు తమ్ముడిలా ఉన్నావ్… హీరో భార్యపై కామెంట్స్

Ayushman-Khurrana

బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్ ఇటీవలే రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. మహిళలపై రొమ్ము క్యాన్సర్ లో అవగాహన కల్పించేందుకు తహీరా సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ వచ్చారు. ఆ సందర్భంలో ఆమె షేర్ చేరిన కొన్ని ఫోటోలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా తహీరా భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోపై ఓ నెటిజన్ “నువ్వు చూడడానికి నీ భర్తకు తమ్ముడిలా ఉన్నావు” అంటూ ఆమె రూపాన్ని విమర్శించాడు. దీనిపై స్పందించిన తహీరా “ఇలాంటి జోకులు నిత్యం వింటూనే ఉన్నాను. మీ కామెంట్స్ వల్ల నా భర్తని చూసినప్పుడల్లా ‘తూ మేరా భాయ్ నహీ హై’ అనే పాట బ్యాగ్రౌండ్ లో వినిపిస్తోంది. మా ఇద్దరి హెయిర్ స్టైల్స్ చూడండి.. వేర్వేరుగా ఉన్నాయి కదా” అని సమాధానం ఇచ్చారు. ఇలాంటి కామెంట్స్ కు బాధపడే రోజులు ఎప్పుడో పోయాయని ఘాటుగా స్పందించారు తహీరా.

Related posts