telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాని ఊపు ఊపేసిన పాప్ స్టార్ ట్వీట్…!!

Gaga

ఇంటర్నేషనల్ పాప్ స్టార్ లేడీ గాగా ఇటీవల ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అని ట్వీట్ చేశారు. అంతే.. ఈ ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియా ఊగిపోయింది. కొద్దిసేపట్లోనే ఈ ట్వీట్‌కు లక్షకుపైగా లైక్స్‌ వచ్చాయి. పలువురు విదేశీ అభిమానులు దానికి అర్థం ఏంటి అని లేడీ గాగాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ వాక్యానికి అర్థం ‘ప్రపంచంలోని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి’ అని మనకు తెలిసిందే. దాంతో అర్థం ఏంటి అని అడుగుతున్న నెటిజన్లకు మన భారతీయులు క్లాస్ తీసుకుంటున్నారు. దాదాపు ఒక రోజు పాటు ఈ ట్వీట్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకీ లేడీ గాగా ఈ ట్వీట్ ఎందుకు చేశారో తెలియరాలేదు. కానీ ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. ఈ ఏడాదిలో ఏ సెలబ్రిటీ ట్వీట్‌‌కు కూడా ఇంతటి స్పందన రాలేదట. త్వరలో తాను కంపోజ్ చేయబోయే కొత్త ఆల్బమ్‌లో ఈ వాక్యాన్ని వాడబోతున్నారని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Related posts