telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Majili

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ చిత్రం నుంచి “వన్ బాయ్… వన్ గర్ల్ లుకింగు… హైటు… వెయిటు చెకింగు…” లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతం, భాస్కర భట్ల సాహిత్యం, రేవంత్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ సాంగ్ ను చూసేయండి.

శాటిలైట్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడుకాగా… జెమినీ టీవీ ఐదు కోట్ల మొత్తాన్ని చెల్లించి సినిమా శాటిలైట్ హక్కులు పొందింది. డిజిటల్ రైట్స్ ను అమెజాన్ కు మూడున్నర కోట్లకు తీసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా మంచి ధర వచ్చినట్లు తెలుస్తోంది. “మజిలీ” చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts