బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివరిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రాకేష్ శర్మ బయోపిక్, సాహిర్ లుథియాన్వి బయోపిక్ వంటి క్రేజీ ప్రాజెక్టులు షారుఖ్ వద్దకు వచ్చాయి. తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ “ప్రస్తుతానికి నేను సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. ఏ సినిమాకి ఓకే చెప్పలేదు. తరచు సినిమాలు చేయడం, విడుదల కాగానే మరో సినిమా మొదలు పెట్టడం, దాని కోసం మూడు నాలుగు నెలల సమయం గడపడం జరుగుతుంది. కాని ఈ సారి అలా చేయాలని అనుకోవడం లేదు. నా మనస్సు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్న నేను సినిమాలు చూడడం, స్టోరీస్ వినడం, బుక్స్ చదవడం చేస్తాను. నా పిల్లలు ఇప్పుడు కాలేజీ స్టేజ్‌కి వచ్చారు. కూతురు కాలేజీకి వెళుతుంది. కొడుకు చదువు పూర్తి కావొస్తుంది. ఈ మేరకు నేను నా కుటుంబంతో మరింత సమయం గడపాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.
previous post