telugu navyamedia
సినిమా వార్తలు

సమంతతో ఉన్న రిలేష‌న్‌పై పెదవి విప్పిన ప్రీతమ్..

ఎంతో ఘాడంగా ప్రేమించుకున్న‌ టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య, సమంత అక్టోబర్‌ 2న తమ వైవాహిక జీవితానికి గుడ్​బై చెబుతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో వీరి విడాకుల అంశం రోజుకొక మలుపు తిరుగుతుంది. ‘సమంత తన స్టైలిష్ట్​, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్​తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రీతమ్ తో స‌మంత‌కు ఎఫైర్​ ఉందని, అందుకే వారు ఇద్దరూ విడిపోయారు’ అనేది ఆ రూమర్స్​ న‌డుస్తుంది.

సమంత- ప్రీతమ్ మధ్య రిలేషన్ పై క్లారిటీ, తెలివి తెచ్చుకోండి.. హాట్ టాపిక్ గా మారిన ఆ పోస్ట్ | makeup artist gives clarity over Samantha and preetham relationship

తాజాగా దీనిపై స్పందించిన జుకల్కర్​.. ఈ పుకార్లకు నాగ చైతన్య ఫుల్​స్టాప్​ పెట్టాలని అన్నాడు. దీనిపై చైతూ ఓ స్టేట్​మెంట్​ ఇవ్వాలని తెలిపాడు. “ప్రతిఒక్కరికీ తెలుసు.. సమంతను నేను ‘జీజీస (అక్క‌) అని పిలుస్తా, మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఎందుకుంటుంది? మా రిలేషన్ గురించి, మా గురించి చైతూకి అంతా తెలుసు.

కానీ అలాంటి రూమర్లు వచ్చినప్పుడు చైతన్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రూమర్లను ఖండించలేదు. అది నాకు చాలా బాధగా అనిపించింది. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పై రూమర్స్ వస్తుంటే చై ఖండించకపోవడం సమంతపై తప్పుడు ప్రచారానికి కారణమయ్యింది. ఈ విషయంపై అతను స్పందించాలి. నెటిజన్లకు అలాంటి కామెంట్లు పెట్టొద్దని చెప్పాలి. అతను ఒక్క మాట చెబితే అది వేరేలా ఉంటుంది. ఇలాంటి రూమర్స్​కు చెక్​ పెట్టడానికి చైతూ స్టేట్​మెంట్​ ఉపయోగపడుతుంది. నేను సమంతని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా.. సమంతతో ప్రేమ విషయంలో నేను గర్వంగా ఉంటా అని అన్నారు.

Related posts