టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుపాటిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఈ డ్రగ్స్ కేసులో రేపు ఈడీ విచారణకు నటుడు రవితేజ రానున్నారు. ఈడీ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్.. ఇకపై రోజు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కెల్విన్ వ్యవహారంపై ప్రశ్నిస్తే తమకు కెల్విన్ ఎవరో తెలియదని సినీ ప్రముఖులు అందరూ చెబుతున్నారు.
దీంతో రోజు విచారణకు హాజరువకావాలని కెల్విన్ ను ఆదేశించారు. సినీ ప్రముఖుల ముందు కెల్విన్ ను ఉంచి విచారణ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు, కెల్విన్ ను కలిపి విచారణ చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది.
కింద పడి మరీ నవ్వుకున్నా… “మన్మథుడు-2″పై అమల కామెంట్స్