telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్ – రాజాసింగ్

తెలంగాణకు బుల్డోజర్లు వ‌స్తున్నాయ‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద భాజపా నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు.

ఈ దీక్షలో పాల్గొన్న రాజాసింగ్​ మాట్లాడుతూ..బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారని, తెలంగాణకు బుల్డోజర్లు రాబోతున్నాయంటూ ఆయన చెప్పారు. యూపీలో ఆదిత్యనాథ్ బుల్డోజర్ తో అవినీతిపరులను తొక్కించారన్న రాజాసింగ్ … ప్రతి నియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్ చేశామని, అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి అవి దూసుకు వెళతాయని రాజాసింగ్ సంచ‌ల‌న‌ కామెంట్స్ చేశారు.

ఈటెలను ఆడుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని రాజాసింగ్​ అన్నారు. ఈటల రాజేందర్​, బండి సంజయ్ వ్యక్తులు కాదని శక్తులని రాజాసింగ్​ అన్నారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు మసైపోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. కేసులకు భాజపా శ్రేణులు ఏమాత్రం భయపడేది లేదన్నారు.

Related posts