telugu navyamedia
ఆంధ్ర వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శేషు కుమార్‌ మృతి..

ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు సూరపనేని శేషు కుమార్ గారు శ నివారం మధ్యాహ్నం 2 గంటలకు తీవ్రమైన గుండె నొప్పితో మరణించారు. శేషుకుమార్ గారు 1989-90 లలో బల్లేపల్లి లో నిర్మల స్కూల్ ను స్థాపించారు.

గత మూడు దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా విద్యారంగానికి ఎనలేని సేవలు అందిస్తూ వచ్చారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల సంఘానికి రాష్ర్ట అధికార ప్రతినిధిగా గత పాతిక సంవత్సరాలుగా విద్యారంగానికి విశేష సేవలందిస్తూ వచ్చారు.

విద్యారంగ సమస్యలపై పలు ఉద్యమాలు నిర్వహించారు. శేషుకుమార్ గారి సతీమణి నిర్మలగారు, కూతురు జోతిర్మయి కొడుకు యోగిరాం. కొడుకు ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్నారు.

సూర‌ప్‌నేని శేషు కుమార్ గారి మృతి ప‌ట్ల ఖ‌మ్మం మాజీ ఎంపీ, టీఆర్ ఎస్ నాయ‌కులు పొంగులేటి, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ,ఎంపీలు నామానాగేశ్వరరావు గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ,తుమ్మల నాగేశ్వరరావు గారు, సండ్ర వెంకట వీరయ్య గారు ,ఎమ్మెల్సీ తాతా మధు గారు , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ,లింగాల కమల్ రాజు గారు, తెలంగాణా సాహిత్య అకాడెమి చైర్మన్ జూలూరి గౌరీశంకర్ గారు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

నిర్మ‌ల స్కూల్ క‌ర‌స్పాండెంట్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేష‌న్‌లో సుదీర్ఘ కాలం రాష్ర్ట అధ్య‌క్షుడిగా , నాయ‌కుడిగా ప‌నిచేసి ఎస్ ఎఫ్ ఐ, ఎఐఎస్ ఎఫ్‌, పీడీఎస్ యు, వాప‌ప‌క్ష విద్యార్ధి సంఘాల వైపు నిల‌బ‌డి గ‌ట్టిగా పోరాడిన మంచి వ్య‌క్తి శేషుకుమార్‌గారు, ప్రైవేటు విద్యారంగంలో విద్యార్ధుల‌కు యాజ‌మాన్యాల‌కు అనేక సేవ‌లు అందించిన శేషు కుమార్‌గారి అకాల మ‌ర‌ణం చెంద‌డం బాధాక‌ర మ‌ని అన్నారు . శేషు కుమార్ కుటుంబానికి త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు

సిపిఎం పార్టీ తరపున సుదర్శనరావు, ఎర్రా శ్రీకాంత్ ,కల్యాణమ్ వెంకటేశ్వరరావు ,సిపిఐ పార్టీ నుండి హేమంతరావు ,పోటు ప్రసాద్ ఎంఎల్ పార్టీ నుండి అశోక్ గారు నివాళులర్పించారు.

అలాగే వివిధ విద్యార్థి సంఘాలు సంతాపాన్ని ప్రకటించాయి. ప్రైవేటు విద్యా సంఘాల నాయకులు,విద్యాసంస్థల కరస్పాండెంట్లు శోకసముద్రంలో మునిగిపోయారు.

సూరపనేని శేషు కుమార్ గారు కు సంతాప సూచ‌కంగా ఆగ‌ష్టు1వ తేదీన ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా కేజి టు పీజీ విద్యా సంస్థ‌లు సెల‌వు ప్ర‌క‌టించాయి. ప్రైవేటు స్కూల్స్ కూడా సెల‌వు ప్ర‌క‌టించే విష‌యంపై ఆదివారం ట్ర‌స్మా రాష్ర్ట ఈసీ జూమ్ మీటింగ్‌లో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Related posts