telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామాలకే యూరియా పంపాలి.. అధికారులకు కేసీఆర్ ఆదేశం

KCR cm telangana

యూరియా తరలింపుపై రైల్వే అధికారులతో తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ చర్చించారు. ఎయిర్ పోర్ట్ నుంచి యూరియా తరలింపునకు 25 గూడ్సులు ఇవ్వాలని కోరారు. శనివారం గూడ్స్ రైలు కేటాయిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే పోర్టుల్లో పర్యవేక్షణకు ఒక్కో అధికారిని పంపాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినానితో సైతం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి యూరియా పంపించేందుకు సహకరించాలని కోరారు.

రైతులకు సరిపోయే యూరియా గ్రామాలకు నేరుగా సరఫరా చేయాలని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో ఎరువులు రైతులకు అందాలని ఆదేశించారు. నాలుగు రోజుల్లో లక్ష టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రగతి భవన్ లో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను సీం కేసీఆర్ ఆదేశించారు.

Related posts