telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

గంగూలీపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు 

sourav ganguly as bcci president

బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదా ఐసీసీ చైర్మన్ అయితే మరింత బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం ఈ నెలలో ముగుస్తుండడంతో గంగూలీ ఆ పదవిని చేపట్టాలని కోరాడు. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్నగంగూలీకి ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. సీఎస్ఏ సీఈవో జాక్వెస్ ఫాల్ కూడా స్మిత్ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు.

ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభ సమయంలో మనోహర్ పదవీకాలం మరో రెండు నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలతో పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఐసీసీ చైర్మన్ గిరీ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ కూడా పోటీపడుతున్నాడు. గంగూలీ లాంటి వ్యక్తి ఐసీసీ అధ్యక్ష స్థానంలో ఉంటే చూడడం చాలా గొప్పగా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు.

Related posts