telugu navyamedia
తెలంగాణ వార్తలు

పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం..

*ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటికీ ఒకే పాలసీ ఉండాలి
*రేపు మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారు..
*పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం
*రా రైస్‌ చేస్తారా? బాయిల్డ్‌ రైస్‌ చేస్తారా? అనేది కేంద్రం నిర్ణయం
*ఎక్కువ పంట వస్తే ప్రాసెస్‌ చేసి నష్టం వస్తే కేంద్రం భరించాలి..

యాసంగిలో వరిని పంజాబ్‌ నుంచి కొన్నట్లే… తెలంగాణ నుంచి కూడా కేంద్రమే కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుంది. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సమావేశం తీర్మానం చేసినట్టుగా సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ధాన్యం కొనుగోలు విషయంలో వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ ఉండాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు 24, 25 తేదీలల్లో పంజాబ్ మాదిరిగా తెలంగాణలో కూడా ఉద్యమం చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రేపు మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు. రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు. కేంద్రం వినకపోతే యాక్షన్‌ ఓరియంటెడ్‌గా తమ పోరాటం ఉంటుందని చెప్పారు.

చేతులెత్తి సమస్కరించి ప్రధానిని వేడుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి… మీరు మాయామశ్చింద్ర చేస్తామని భ్రమలో ఉండొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ సూచించారు.

ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుంది. మా దగ్గర ధాన్యం తీసుకోండి… ఏ రైస్‌ తీసుకుంటారో మీ ఇష్టం. బాయిల్డ్‌ రైస్‌ తీసుకుంటారా, రా రైస్‌ తీసుకుంటారా అనేది కేంద్రం బాధ్యత అని కేసీఆర్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్థాయిలో ఉద్యమం ఉంటుందని ఆయన చెప్పారు.

అంతేకాకుండా..ప్రశాంత్‌ కిశోర్‌ తనతో కలిసి పనిచేస్తున్నాడని, అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పనిచేస్తానన్నారు. గత 8 ఏళ్లుగా పీకేతో తనకు స్నేహం ఉందన్నారు.

 

 

Related posts