telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎట్టకేలకు దొరికిపోయిన చిరుత..

Leopard

హైదరాబాద్ శివారులో చిరుత నిన్న మరోసారి కలవరం రేపిన సంగతి తెలిసిందే.. అయితే హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో స్థానికులకు భయాందోళనకు గురిచేస్తూ…గత నాలుగైదు నెలలుగా అటవీ శాఖ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుతను ఎట్టకేలకు అధికారులు ఇవాళ పట్టుకున్నారు. 4 నెలలుగా అటవీ శాఖ సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్న ఆ చిరుత…మే నెలలో రంగారెడ్డి జిల్లా మైలార్‌ దేవపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌ రైల్వే ట్రాక్‌ వద్ద చిరుత మెయిన్‌ రోడ్డుపై కనిపించింది. రోజు నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. ఆ తర్వాత లారీ డ్రైవర్‌ పై దాడి చేసింది చిరుత. అప్పటి నుంచి దానికోసం అటవీశాఖ అధికారుల వేట కొనసాగుతూనే ఉంది.

అప్పుడప్పుడు బయటకు రావడం పశువులపై దాడి చేయడం…మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లూ వచ్చింది. వాలంతరీలో నెల రోజుల కింద పశువుల కొట్టంపై దాడి చేసింది చిరుత. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసిన అధికారులు..వ్యవసాయ క్షేత్రంలో నెల రోజుల తర్వాత మరోసారి శుక్రవారం ఓ లేగదూడను అర్ధరాత్రి చంపేసింది. ఇక, మరోసారి అదే వ్యవసాయ క్షేత్రంలోకి ఇవాళ రాత్రి సమయంలో రాగా…అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుపోయింది. దీంతో చిరుతను జూపార్క్ కు తరలించారు అటవీశాఖ అధికారులు. చిరుత దొరికిపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts