telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పోవాలి -కేసీఆర్

*యూపీలో గతంలో 312కు గాను 255 స్థానాలకు భాజపా పరిమితమైంది..
*సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి..
*యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పా
*పంజాబ్‌లో బీజేపీని త‌రిమి కొట్టారు…
*దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పోవాలి..
*భాజపా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదు..
* దేశం బాగుపడాలంటే బీజేపీను గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారు..
* యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు భాజపాకు అధికారం ఇచ్చారు..
*భాజపా మరింత అధ్వాన పాలన సాగిస్తోంది..
* ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారు

దేశం బాగుపడాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూపీలో గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చాయన్నారు.  బీజేపీ ఇచ్చిన హామీలను  ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని కేసీఆర్ విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు తగ్గాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి 50 సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచించాలన్నారు. ఉత్తరాఖండ్‌లో సీట్లు, ఓట్లు తగ్గాయని.. పంజాబ్‌లో బీజేపీ ని తరిమికొట్టారంటూ పేర్కొన్నారు.

యూపీలో బేజీపీ బలం తగ్గుతుందని గతంలోనే చెప్పానని.. గతంలో 312కు గాను 255 స్థానాలకు బీజేపీ పరిమితమైందిసీట్లు తగ్గడం దేనికి సంకేతమో ఆ పార్టీ ఆలోచించుకోవాలని సీఎం సూచించారు. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని.. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురాలేదన్నారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. జీడీపీ భారీగా పడిపోయింది. నిరుద్యోగిత పెరిగిపోయింది. మాకు ఇంతే వస్తుంది ఇంతకు మించి చేతకాదని చెప్పకనే చెప్పారని కేసీఆర్ తేల్చేశారు.

యూపీఏ పాలన సరిగా లేదని ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారని.. కానీ బీజేపీ మరింత అధ్వాన పాలన సాగిస్తోంద్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తాబేదార్లకు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. ఏ రంగంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ సూచించారు.

ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా బలపడే ఆలోచన తప్ప యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. 

ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం కేసీఆర్ అన్నారు .ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాల్సి ఉన్నందున గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts