telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో రెండు టర్మ్‌లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KCR cm telangana

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు టర్మ్‌లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు తనకు 66 ఏళ్లని, ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేయనా అని కేసీఆర్ స్పీకర్‌నుద్దేశించి చెప్పడం విశేషం. ఎన్ని శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటానని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కొందరు “కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందట కదా.. అమెరికాకు పోతడట కద” అని తప్పుడు ప్రచారం చేశారని కేసీఆర్ చెప్పారు. 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారని.. ఇరవై ఏళ్లయినా తాను చావలేదని కేసీఆర్ అసెంబ్లీలో చమత్కరించారు. ఇప్పుడు కూడా తనకు ఏం కాలేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా కేసీఆర్ దిగిపోయి.. కేటీఆర్‌ను సీఎంను చేస్తాడని కొందరు తన గురించి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

Related posts