telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కలర్ ఫుల్…జీవితం

పక్క వారి జీవితం
చూసేందుకు కలర్ ఫుల్గా
ఆశిస్తే అందే అంత దగ్గరగా
చూపురలకు కనిపించొచ్చు…
కానీ
నడిచి వెళ్ళే దారిలో
రాలేదటారో ముళ్ళే గుచ్చుకున్నాయో
ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటూ
దారి తెలియని గమ్యం వైపు
తీరం చేరే వరకు ఎలా నడిచారో
ఎవరికి తెలుసు?
నిజానికి…
ఆ దారిలో సాయం చేసింది ఎవరో
తోడుగా నిలిచింది ఎవరో
చీకటిలో వెలుగు చూపింది ఎవరో
తీరం దాటించింది ఎవరో
వారికి మాత్రమే తెలుసు!
చూసేవన్ని నిజాలు కాదు
చూడనిది అబద్ధము కాదు
ప్రతి దారి జీవితానికి పునాది కాదు
ప్రతి మార్గం నీకు భవిష్యత్తు కాలేదు!
కృషి వెనుక కష్టం
మంచి వెనుక మర్మం
చెడు వెనుక గుణపాఠం
ఎన్నడూ బయటికి కనిపించని సత్యం!
గుడ్డిగా ఎవరిని అనుసరించకు
ఆ కష్టాన్ని దాటే దైర్యం నీలో లేనప్పుడు
అర్ధాంతరంగా నీ ప్రయాణం ఆగిపోతుంది
మజిలీ చేరక మునుపే ముగిసిపోతుంది
పనికిరాని ప్రయాస ప్రాణాలను తీసేస్తుంది!!

Related posts