telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం.. ముహుర్తం ఖరారు..?

వచ్చే నెలే సీఎం గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని..ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయితే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య చాలామంది సీనియర్ నేతలు సైతం కేటీఆర్ త్వరలో రాష్ట్రానికి సీఎం అవుతారని చెబుతున్నారు. అయితే కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గా ఫిబ్రవరి18 న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాాట్లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ సీఎం గా కేటీఆర్.. ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని తెలిసింది. ఈ లోపు కేసీఆర్ యాగాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం కేసీఆర్ నిర్వహిస్తారని సమాచారం.
ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకు కు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. గత రెండు నెలలుగా కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జోరుగా జరుగుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎం గా అర్హతలు ఉన్నాయంటూ సమర్ధిస్తున్నారు….

Related posts