ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు విమర్శనాస్త్రాలు సంధించారు. తొమ్మిది నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందన్నారు. కూల్చివేతలు, రద్దులతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రిలయన్స్, అదాని వంటి ప్రముఖ సంస్థలు కూడా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయ వేసిన వ్యాజ్యాలు వీగిపోయాయని చెప్పారు. కానీ వైఎస్ హయాం నాటి అధికారులపై ఇప్పటికీ కేసులు ఉన్నాయని కళా వెంకట్రావు గుర్తు చేశారు.
గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…