telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఐదేళ్ల కుర్రాడి పనికి కంగుతిన్న పోలీసులు

Michigan-5-Yrs-Old-Boy

మిచిగాన్‌లో నివాసం ఉండే ఓ ఐదేళ్ల కుర్రాడు చేసిన పనికి పోలీస్ అధికారులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే… ఓ ఇంట్లో నాయనమ్మతో కలిసి ఉంటున్నాడు ఇజయా హాల్. తనకు మెక్‌డోనాల్డ్స్ బర్గర్‌ తినాలని ఉందని నానమ్మకు చెప్పాడతను. అయితే ఒంట్లో బాలేదంటూ ఆ వృద్ధురాలు నిద్రపోయింది. దాంతో ఏం చేయాలో తోచని ఆ ఐదేళ్ల కుర్రాడు.. ఫోన్ తీసుకొని తనకు తెలిసిన సులువైన నంబర్ 911 అమెరికాలో ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశాడు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సారా కుబెర్‌స్కీ ఏం కావాలని ప్రశ్నించింది. తనకు బర్గర్ కావాలని ఆ కుర్రాడు చెప్పడంతో ఆమె ఖంగుతింది. కుదర్దని చెప్పి కాల్ కట్ చేసిన ఆమె.. ఆ ఫోన్ వచ్చిన ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇలా చిన్నపిల్లలు ఫోన్లు చేయడం కొత్తకాదు. అయినా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఎటువంటి ప్రమాదమూ లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. బాలుడి ఇంటికి బయల్దేరిన డాన్ పాటర్సన్ అనే అధికారి.. ఫోన్ విషయం తెలుసుకొని మార్గమధ్యంలో ఉన్న మెక్‌డోనాల్డ్స్ షాపుకెళ్లి బర్గర్ తీసుకొన్నాడు. ఆ బాలుడి ఇంటికెళ్లి ఎటువంటి ప్రమాదమూ లేదని నిర్ధారించుకొని, ఆ పిల్లాడికి బర్గర్ ఇచ్చి వచ్చాడు. విషయం తెలుసుకున్న అధికారులంతా నవ్వుకున్నారు. మన దేశంలో కూడా ఇలాంటి పోలీసులు ఉంటే ముందుగా సంతోషించేది పిల్లలే.

Related posts