telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌ట్టి త‌వ్వకాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం..వంశీ అంటే మాకెందుకు భ‌యం..

*మ‌ట్టి త‌వ్వకాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం..
*వంశీ హీరో అనుకుంటే సినిమాలు తీసుకోమ‌నండి..
*గ‌తంలో జ‌గ‌న్‌ని, భార‌తిని తిట్టాడు..ఇప్ప‌డు చంద్ర‌బాబుని,భువ‌నేశ్వ‌రిని తిడుతున్నాడు..
*అరిచే కుక్క క‌ర‌వ‌దు..
*రాజ‌కీయాల్లో జెంటిల్‌మెన్‌ల‌తో క‌లిసేవాడిని..
*వంశీ అంటే మాకెందుకు భ‌యం..

అధికార వైసీపీలో వర్గ పోరు కలకలం రేపుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.

2019 గ‌న్న‌వ‌రం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని.. మట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ వల్లభనేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునని. అతనో హీరో మహేష్ బాబు, అతని పక్క ఉన్న వ్యక్తి హీరో ప్రభాస్ కాదు కదా’ అంటూ వంశీ తనదైన శైలిలో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు.

గత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గ‌న్న‌వ‌రం నుండి వల్లభనేని వంశీ విజయం సాధించాడని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. నకిలీ ఇళ్ల పట్టాలు కూడా వంశీ విజయానికి దోహదమయ్యాయన్నారు. వంశీకి భయపడేవాడిని అయితే గత ఎన్నికల్లో తాను గన్నవరం నుండి ఎందుకు పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు.

ఆదివారం నాడు యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు..వంశీ ఉపయోగించిన అసభ్య పదజాలంపై తాను వ్యాఖ్యలు చేయబోనన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. కానీ అసభ్యంగా దూషించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు.

ఈ రకంగా దూషించుకోవడం వల్ల ప్రజలకు ఏం చెబుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయించేది అధిష్టానం నిర్ణ‌య‌మ‌ని అన్నారు.. నియోజకవర్గంలో తన అనుచరుల ఇళ్లలో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరైతే తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ లో ఉన్న సమయంలో వైఎస్ జ‌గ‌న్ ఆయ‌న సతీమ‌ణి వైఎస్ భారతీ తో పాటు తమ పార్టీ నేతలను వంశీ తీవ్రంగా విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. 

తన అనుచరులపై కేసులు బనాయిస్తున్నారని దీని వెనుక వంశీ ఉన్నాడని ఆయన ఆరోపించారు. తన వర్గానికి ఏం చేయలేకపోయాయని అనేక నిద్రలేని రాత్రులు కూడా గడిపినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాకు వివరించారు.

 

Related posts