ఏపీలోనే కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్‌ను రంగంలోకి దింపారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చుల కోసం రూ.28 లక్షల చెక్‌ను కూడా అందజేశారు గులాబీ అధినేత… ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్… పార్టీలో చేరనప్పటి నుండి మా నాన్నను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు.. మా నాన్న ఏ ఆశయాల కోసం పనిచేశాడో.. ఆయన ఆశయాలు నెరవేరుస్తానన్న ఆయన.. నాన్న చనిపోయాక వచ్చిన ఎన్నికలు ఇవి… ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. నోముల నర్సింహయ్య వారసునిగా నాకు సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు నోముల భరత్.
previous post