భారత్ – చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనదైన శైలిలో స్పందించారు. చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న దానిపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
“చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే, ఏ ప్రదేశం నుంచి చైనా వెనక్కి వెళ్లింది… ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఈ వివరాలను నాకు ఎవరైనా చెబుతారా?” అని అడిగారు. ఈ వివరాలను తాను కేంద్రం నోట వినాలనుకుంటున్నానని చిదంబరం వ్యాఖ్యానించారు.
చైనా వెనక్కి మరలిన ప్రాంతం నుంచే భారత బలగాలు కూడా వెనక్కి మరలాయా? ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు కావాలి. అసలు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారు” అంటూ చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్