telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలు: చంద్రబాబు ప్రశంసలు

chandrababu

ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగాచంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. వైద్యులకు, నర్సులకు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణపై ప్రపంచం అంతా తల్లడిల్లుతోందన్నారు.

ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు గండం ఉంటుందని తెలిసి కూడా మన ప్రాణాలు కాపాడడానికి వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు శిరసా నమామి అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజారోగ్యం పెనుప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడం అందరి విధి అని చంద్రబాబు సూచించారు. వైరస్ కట్టడికి చేస్తున్న కృషిలో అందరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

Related posts