telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్‌ అన్ని దేశాలకు సాయం చేయాలి: రాహుల్

rahul gandhi to ap on 31st

కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రాణాధార ఔషధాలను మొదట భారతీయులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. స్నేహం అంటే ప్రతీకారం కాదు, ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అన్ని దేశాలకు సాయం చేయాలన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ఔషధాలకు డిమాండ్ పెరగడంతో పలు దేశాలు భారత్‌ వైపు చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్‌ను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కావాలని కోరడం, పలు ఔషధాల ఎగుమతులు చేయబోమని ఆ వెంటనే భారత్‌ నుంచి ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామనేలా ట్రంప్‌ మాట్లాడడంతో భారత్‌ దీనిపై పునరాలోచన చేసినట్టు తెలుస్తోంది.

Related posts