telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోదావ‌రి ప్ర‌జ‌లు బుర‌ద‌లో బాధ‌ప‌డుతుంటే.. జ‌గ‌న్ గాల్లో తిరిగి వెళ్ళిపోయారు.

* వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
*గోదావ‌రి ప్ర‌జ‌లు బుర‌ద‌లో బాధ‌ప‌డుతుంటే..సీఎం జ‌గ‌న్ గాల్లో తిరిగి వెళ్ళిపోయారు.

కోనసీమ , పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.

ముంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.తమకు వరద సహాయం అందలేదని, తమను వరదల సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులు చంద్రబాబు ఎదుట వాపోయారు.

ఈ సంద‌ర్భంగా ..వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావ‌రి ప్ర‌జ‌లు బుర‌ద‌లో బాధ‌ప‌డుతుంటే..సీఎం జ‌గ‌న్ గాల్లో తిరిగి వెళ్ళిపోయారని అన్నారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదని ఆక్షేపించారు.

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే ఆందోళనలు చెలరేగి, శ్రీలంక పాలకుల లాగా పారిపోవడం ఖాయమని మండిపడ్డారు.

‘వరద వస్తే చెప్పి రాదు. పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి.. ఎంత ప్రమాదం ఉంటుందో ప్రభుత్వమే అంచనా వేయాల‌ని అన్నారు. .

పోలవరాన్ని ముంచేశారన్న చంద్రబాబు.. డ్యాం నిర్మాణం పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని చెప్పారు. పోలవరం పూర్తై నదులు అనుసంధానం అయ్యుంటే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదన్నారు.

Related posts