ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభకు హాజరైన చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఇలాంటి గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక రోజు అని చంద్రబాబు అభివర్ణించారు. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభి దీదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. అనంతరం తన ప్రసంగాన్ని ఆంగ్లంలో కొనసాగించారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశాదిశ చూపిందన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి