telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

దొంగ సర్వేలతో ప్రజాదరణను మార్చలేరు: చంద్రబాబు

Chandrababu fire sakshi media
దొంగ సర్వేలతో ప్రజాదరణను తారుమారు చేయలేరని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే అని వ్యాఖ్యానించారు. శుక్రవారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 ఎన్నికల ముందు ఇలానే తప్పుడు సర్వేలు చేశారని..కానీ టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని తెలిపారు. సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్‌రెడ్డి రుజువు అని చంద్రబాబు అన్నారు. 
రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షా 16వేల కోట్ల నిధులు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోదీని జగన్‌ ప్రశ్నించరని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు ప్రాణం పోసింది టీడీపీనే సీఎం తెలిపారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10వేలు ఇచ్చామని..మరో రూ.10వేలు ఇస్తామని వెల్లడించారు.

Related posts